
– ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మరో రెండు పథకాలు ప్రారంభం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తుందని, టిఆర్ఎస్ పార్టీ లాగా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టబోదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ సబ్బండ వర్గాలకు సమ న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్నామని వాటికి తోడుగా మరో రెండు పథకాలను తెలంగాణ ప్రజల కోసం రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గృహ లక్ష్మి,గృహ జ్యోతి హామీలు అమలు కానున్నట్లు తెలిపారు.రేవంత్ రెడ్డి సాగిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని కొందరు బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటిలను అమలు చేసే విదంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.ప్రజలను మభ్యపెట్టి,ప్రజా ధనాన్ని దోచుకున్నది మీరు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు నెరల్లా నరసింగం,లింగాల భూపతి,గుగ్గుళ్ల శ్రీకాంత్,పొన్నాల పరుశురాం,ఎగుర్ల ప్రశాంత్,మోర లక్ష్మిరాజం,ఆసాని సత్యనారాయణ రెడ్డి,సామల గణేష్,బాలసాని శ్రీనివస్,మచ్చ శ్రీను,బండి పరుశురాం,గోగు తిరుపతి,కొల శంకర్,యండి సలీం,అలువాల మల్లేశం పాల్గొన్నారు.