– సంస్కరణల్లో భాగంగానే చెప్పాం
– శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మేం కచ్చితంగా చేయమనట్లేదు. రైతుల దగ్గర నుంచి బిల్లులు వసూలు చేయమనట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పులు తీసుకుంటామంటే సంస్కరణలు అమలు చేయాలని చెప్పాం. చేయాలా? వద్దా? అనేది మీఇష్టమనే అప్షన్ కూడా ఇచ్చాం. చేయకపోతే చేయకండి? కంపల్సరీ చేయాలని చెప్పామా? లేదే? ఇది కావాలి..అదీ కావాలి..అంటే ఎలా? ఇంకా అప్పులు కావాలంటే సంస్కరణలు అమలు చేయండి. మేం మీటర్ పెట్టం. ఎంత విద్యుత్ వినియోగం అవుతున్నదన్నది చెప్పం. బిల్లులు కట్టడంలో ఎప్పుడు డిలే చేస్తూ ఉంటాం. రుణాలు మాత్రం కావాలంటే ఎలా? ఇష్టం లేకపోతే పెట్టవద్దు. ఇది సీఎంల సమావేశంలో రికార్డెడ్‌గా ఉన్న విషయం. ఇది కావాలి అదీ కావాలి మోడీ అంటే ఎలా?’ అని మోటార్లకు మీటర్ల అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియాలో మీడియాతో సీతారామన్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. తెలంగాణలో బీసీ నేతను సీఎం చేసి తీరుతామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనీ, వాటిలో ఏ ఒక్క దాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని, నైపుణ్యమున్న యువతను ఉపయోగించుకోవడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని చెప్పారు. రాష్ట్ర సర్కారు చేసిన అప్పులు రాబోయే తరాలకు భారంగా మారబోతున్నదని హెచ్చరించారు. దళిత సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం రాజయ్యను ఆరు నెలల్లోనే పదవి నుంచి తొలగించారని తెలిపారు. బీసీల అభివృద్ధి కోసం రూ.3,300 కోట్లు వినియోగిస్తామని చెప్పి రూ.77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారనీ, ఆ నిధులు ఎక్కడ వాడారో తెలియదని చెప్పారు. రాష్ట్రంలోని 11 వర్సిటీల పరిధిలో 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర సర్కారు విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదన్నారు. నిరుద్యోగభృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆరు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. జనవరి 22న అయోధ్య రామమందిరాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కేసీఆర్‌ను జాతీయ నేతగా ఎవ్వరూ ఒప్పుకోవడం లేదనీ, బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ అనేది బూటకమని ఆమె విమర్శించారు. న