వైట్‌ మనీని బ్లాక్‌ మనీగా మారిస్తే..?

White money If it becomes black money..?నివేదా పేతురాజ్‌, రిత్విక్‌ ముఖర్జీ, అవినాష్‌ తివారీ తదితరులు నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ‘కాలా’. హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ లాంగ్‌ ఫారమ్‌ స్టోరీ టెల్లింగ్‌లోకి టి-సిరీస్‌ తమ మొదటి వెంచర్‌ ‘కాలా’తో ఎంట్రీ ఇచ్చింది. బిజోరు నంబియార్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఈనెల15 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం కానుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బిజోరు నంబియార్‌ మాట్లాడుతూ, ‘నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే వ్యక్తుల గురించి మనమందరం విన్నాము – కానీ ఎవరైనా తెల్లధనాన్ని నల్లగా మార్చే పరిస్థితిని మీరు ఎప్పుడైనా ఊహించారా? ప్రతీకారం, అధికారం డబ్బును జయించే ప్రపంచంలో అబద్ధాలు, మోసాల వల ద్వారా జీవితం అనే ఆటలో గెలవడానికి ఏకైక మార్గం. డిస్నీం హాట్‌స్టార్‌లో రాబోయే ఈ ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ కాలాలో ‘కాలా’తో మీరు ఇంతకు ముందెన్నడూ చూడని నేరాలను చూడబోతున్నారు’ అని తెలిపారు.
భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌తో కలిసి బిజోరు నంబియార్‌ దీన్ని నిర్మించిన దీనికి బిజోరు నంబియార్‌, ఫ్రాన్సిస్‌ థామస్‌, ప్రియస్‌ గుప్తా, మిథిలా హెగ్డే, శుభ్ర స్వరూప్‌ రచయితలు.