
స్త్రీ లేకుంటే ప్రపంచం లేదు, స్త్రీ లేకుంటే సృష్టి లేదని పాటల రూపంలో, మాటల రూపంలో అనేక విషయాలు చెప్పడం జరిగిందని, మీ పట్టుదల చూసుకుంటే, మాడల్ కాలని చేసే సత్తా మీలో ఉందని బీజేపీ అర్బన్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మారుతి నగర్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఒక్క రోజు మహిళలకు గౌరవం ఇవ్వకుండా యేడాదిలో 365రోజులు గౌరవిస్తే మహిళలపై గౌరవం పెరిగి అత్యాచారాలు, మహిళల పై అన్యాయాలు తగ్గుతాయని అన్నారు. ప్రధాని మోడీ మహిళలకు గౌరవం ఇస్తూ సుకన్యా సంవృద్ది యోజనా కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. అంతే కాకుండా ముస్లీం మహిళపై త్రిపుల్ తలాక్ పేరుతో జరుగుతున్న అన్యాయాన్నికి గురయ్యారని, త్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి వారికి గౌరవాన్ని కల్పించారన్నారు. సమాజంలో నీచమైన రాజకీయ నాయకులు కొందరు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఇటువంటి ఘటన వారం రోజుల క్రితం పక్క జిల్లా నిర్మల్‌లో జరిగిందన్నారు. ప్రభుత్వం మహిళలకు 33 శాతం శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, గొప్ప గొప్పమహిళలు అనేక రంగాలలో ఉన్నారు. వారిని స్పూర్తిగా తీసుకొని సమాజంలో మార్పు తీసుకురావాలని, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని పిలుపు నిచ్చారు. అనంతరం మహిళలను సన్మానించారు.