ప్రస్తుతం చాలా మంది జంటలు చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. ఓపిక తక్కువై గొడవలు పెరగుతున్నారు. దీంతో సంబంధాల్లో గొడవలు, గొడవలు ఏర్పడి జీవితాన్ని ఇబ్బందికరంగా మారుస్తున్నాయి. అయితే ఏ విషయంలోనైనా గొడవలు వచ్చినప్పుడు కాస్తా సహనంగా ఉంటే అవి సద్దుమణుగుతాయి. అలానే కొన్ని చిట్కాలు పాటించినా సమస్యలు రావు. అవేంటో తెలుసుకోండి.
చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దు: కోపం రావడం సహజం. అయితే, గొడవలో కోపం వస్తే పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి, అలాంటి సందర్భంలో భర్త శాంతించడమో, మౌనం వహించడమో చేస్తే కాసేపట్లోనే కోపం తగ్గుతుంది.
మాటలతో జాగ్రత్త: గొడవ పడినప్పుడు చాలా మంది మాటలు అనుకుంటారు. బూతులు తిడుతుంటారు. దీని వల్ల నష్టం జరుగుతుంది. ఎందుకంటే, మీరు మాట్లాడే మాటలు మీ పార్టనర్‌ని మరింత బాధపెట్టొచ్చు. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి.
ప్రవర్తన: ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు మౌనం వహించండి. ఏం మాట్లాడకపోవడమే మంచిది. వారూ, మీరూ ఒకే విధంగా మాటలనుకుంటే ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. అలా కాకుండా కాస్తా సహనంగా ఉండండి.
ఓదార్చడం: కోపంలో ఎన్నో మాటలు అనడం, కంప్లెంట్స్ చేయడం వంటివి ఉంటాయి. దీంతో బాధపడతారు. లోలోపలే కుంగిపోతారు. కాబట్టి, అలా ఎప్పుడు మాటలు, చేతలు హద్దులు దాటొద్దు. ఒత్తిడిని పెంచుకోవద్దు. ఒకవేళ అలా జరిగినా తర్వాత ఓదార్చడం మంచిది. మరి ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు మాటలని దూరమయ్యే బదులు ఆ పరిస్థితిలో బయటికి వెళ్ళిపోవడం మంచిది.
ప్రశాంతంగా ఉన్నప్పుడు: అదే విధంగా, గొడవల సమయంలో మాటలనుకోవడం కాకుండా తర్వాత ఆ గొడవకి కారణమైన సమస్య గురించి ప్రశాంతంగా మాట్లాడం మంచిది. దీని వల్ల ఇద్దరూ ఏకాభిప్రాయ నిర్ణయానికొస్తారు. గొడవ తగ్గుతుంది.