ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎన్నికల విధులలొ ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుంగతుర్తి ,కోదడ నియోజక వర్గంలోని యస్. యస్. టి ఆదికారులు విధులలో నిర్లక్ష్యం వహించినందుకు గాను పదిమంది అధికారులకు మెమోలు జారీ చేయనైనదని,  జిల్లా కలెక్టర్ నిర్వహించిన వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు 13 మంది   పాల్గొనక పోవడం వలన వారికి హెచ్చరిక  మెమో లు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదేవిదంగా   కోదాడ నియోజక వర్గంలో నలుగురు,  తుంగతుర్తి నియోజకవర్గంలో ఆరుగురు ఎస్.ఎస్.టి. టీం అధికారులు సరైన రీతిలో విధులు నిర్వహించకపోవడం పై, విధులు నిర్లక్ష్యం గా వ్యవహరిరిస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తూ మెమోలు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ ఓటు సద్వినియోగనికి స్పెషల్ క్యాజువల్ లివ్ మంజూరు.లోక్ సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం సూచనల ప్రకారం ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ (వి ఎఫ్ సి) లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాటానికి   స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం జరిగిందని జిల్లా  ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు.