– విజృంభిస్తున్న జ్వరాలు
– జాగ్రతలు పాటించాలంటున్న వైద్యులు
నవతెలంగాణ-జైపూర్
ఎక్కడ చూడు జ్వరాలు..వైరల్ జ్వరాలతో పాటు చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలతోఇబ్బందులు తప్పడం లేదు..వర్షాకాలం ఆరంభానికి ముందు నుండే వైధ్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైనా జ్వరాల వ్యాప్తి కొనసాగుతోంది. దోమ చిన్న ప్రాణి అలాగని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం తెచ్చి పెడుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే తప్పా ప్రానాపాయం నుంచి బయటపడలేము. దోమల నియంత్రణకు సమిష్టిగా చర్యలు తీసుకుంటే వ్యాదుల భారిన పడకుండా ఉంటారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో సీజనల్ వ్యాదుల నుంచి రక్షణ పొందుతారు. ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ దోమ మురికి నీటిలో ఉండదు పరిశుభ్రమైన నీటి నిల్వలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి చుట్టు ఎక్కడ కూడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు కూలర్లు, పాత సామాన్లు, ప్లాస్టిక్ వస్తువులు, అవసరం లేనటువంటి వస్తువులు ఉంటే వర్షపు నీరు నిలిచి అందులో డెంగ్యూ దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని గ్రామాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఎడీస్ ఈజిప్టి దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ దోమ 3 రోజుల వ్యవదితో లార్వా నుండి ప్యూబాగా మారుతుంది. డెంగ్యూ జ్వరానికి ప్రత్యేకమైన చికిత్స లేదు కాబట్టి నివారించుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు తెలుపుతున్నారు.
డెంగ్యూ లక్షణాలు
డెంగ్యూ జ్వరం వచ్చిన వారిలో తీవ్రమైన తల నొప్పి, తీవ్రమైన జ్వరం ఉంటుంది. శరీరంపై దద్దుర్లు, ఒక సంధర్భంలో చర్మం ద్వార రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కండరాలు, కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం ఈ కారణంగా ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉంటుంది. దోమలను నిర్మూలించడం.. దోమకాటు నుండి రక్షించుకోవడం.. దోమలు కుట్టకుండా మనకు మనం అప్రమత్తంగా ఉండటం మనకు మన తోటి వారికి మంచిది.
వైరల్ జ్వరాలే అత్యధికం
ముస్తాఫా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైధ్యులు జైపూర్
జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైరల్ జ్వరాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. చికెన్ గున్యా, మలేరియా జ్వరాలు కూడా తక్కువగా కన్పిస్తున్నాయి. వర్షాకాలం ఆరంభం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నర్సింగాపూర్(ఎస్) ముదిగుంట, పెగడపల్లి, గంగిపల్లి, మిట్టపల్లి, ఎల్కంటి, కానుకూరు గ్రామాల్లో వైధ్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా భీమారం ఉప ఆరోగ్య కేంద్రం పరిధిలో భీమారం, మద్దికల్, పోలంపల్లి, దాంపూర్, భూర్గుపల్లి, ఖాజిపల్లి గ్రామాల్లో వైద్య శిభిరాలు ఏర్పాటు చేశాం. 2023 సంవత్సరంలో మలేరియా కేసులు నమోదు కానప్పటికీ భీమారం, ముదిగుంట, కానుకూరు, పోలంపల్లి గ్రామాల్లో ఒక్కొక్క డెంగ్యూ జ్వరం నమోదైంది. 2024 సీజన్‌లో భీమారం సబ్ సెంటర్ పరిధిలో రెండు డెంగ్యూ జ్వరాలుగా గుర్తించాము. డెంగ్యూ జ్వరం వచ్చిన వారికి అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నాం.