వంట చేసేప్పుడు.. కిచెన్ ప్లాట్‌ఫామ్, స్టౌ, సింక్ ఎక్కువగా వాడుతుంటాం. వీటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి శుభ్రంగా లేకపోతే.. వంట చేయాలనిపించదు. కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రంగా లేకపోతే.. బొద్దింకలు, ఈగలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాదు, వర్షాకాలం ఇళ్లు పరిశుభ్రంగా లేకపోతే.. రకరకాల అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. అందుకే కిచెన్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
వంట పూర్తైన తర్వాత..కిచెన్ ప్లాట్‌ఫామ్, స్టౌను చక్కగా శుభ్రం చేసుకుంటే.. చూడటానికి అందంగా ఉంటుంది. నీళ్లలో వెనిగర్ కలిపి శుభ్రం చేస్తే.. క్రిములు మాయం అవుతాయి.
కిచెన్‌లో నూనె ఒలికిపోతే వెంటనే నూనె మీద గోధుమ పిండి చల్లాలి. ఐదు నిమిషాల తరువాత పేపర్‌తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డులేకుండా శుభ్ర పడుతుంది.
కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై మరకలు ఉంటే.. బేకింగ్ సోడా వేసిన నీళ్లతో తుడిస్తే వెంటనే తొలగుతాయి.
కూరగాయలు తరిగిన తర్వాత వాటి చెత్త అంతా గట్టు పైన పేరుకుంటుంది. వంట అంతా అయ్యాక పడేద్దామని అలాగే పెట్టకూడదు. వాటి తేమ, మరకలు క్యాబినెట్‌ని పాడుచేస్తాయి.
వంట పూర్తైన తర్వాత.. సింక్ శుభ్రం చేసుకుంటే.. వైరస్, బ్యాక్టీరియాలు వృద్ధి చెందకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు సింక్‌లో మాంసాహారం కడిగిన తర్వాత దాన్ని సోప్ వాటర్‌తో శుభ్రం చేయండి. ఇలా చేస్తే.. దుర్వాసన రాకుండా ఉంటుంది.