రోజూ ఇలా చేస్తే..

If you do this everyday..పీసీఓఎస్‌ (పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌).. మహిళల పాలిట శాపంగా మారింది. ప్రస్తుత జీవన శైలి కారణంగా.. దేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొంత మందికి తమకు ఈ సమస్య ఉందని కూడా తెలియదు. ఇక వీరు నెలసరి క్రమం తప్పడం, సంతానలేమి, మూడ్‌ స్వింగ్స్‌, ఊబకాయం, చర్మపు ట్యాగ్‌లు, చర్మం నల్లబడటం, కంటి నొప్పి, జుట్టు రాలడం, మొటిమలు.. వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. పీసీఓఎస్‌ ఉన్న మహిళలందరికీ ఒకే లక్షణాలు ఉండవు. వారి వయసు, శరీరతత్వం ప్రకారం లక్షణాలు మారతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం… పీసీఓఎస్‌తో బాధపడే స్త్రీలకు గుండె జబ్బులు, మధుమేహం, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదముంది. పీసీఓఎస్‌ సమస్య ఉన్న మహిళలు..చక్కటి లైఫ్‌స్టైల్‌తో దాన్ని అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
కరెక్ట్‌గా తినండి..
మీరు ఏది తింటున్నారనేదే కాదు.. ఎప్పుడు తింటున్నారనేది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రోజూ సమయానికి ఆహారం తీసుకునేలా ప్లాన్‌ చేసుకోండి. మీ శరీరంలోని టాక్సిన్స్‌ తొలగించడానికి ఆరోగ్యకరమైన, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇంట్లో వండిన ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. ఫైబర్‌, ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా లభించే గుడ్లు, బాదంపప్పులు, ఓట్స్‌, పాలు, పాల పదార్థాలు, చికెన్‌.. వంటివి రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే శీతల పానీయాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బంగాళాదుంపలు, వైట్‌ బ్రెడ్‌.. వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.
వ్యాయామం, యోగా
రోజూ మీరు వ్యాయామం, యోగా చేస్తే మీరు యాక్టివ్‌గా ఉంటారు. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. మీ శరీరంలో కొవ్వు కరుగుతుంది. మీ మానసిక స్థితి మెరుగుపరచడానికి, హార్మోన్లను సమత్యులం చేయడానికి సహాయపడుతుంది. శరీరం యాక్టివ్‌గా ఉండాలంటే వారానికి ఐదు సార్లు గంట వ్యాయామం తప్పనిసరని ఫిట్‌నెస్‌ నిపుణులు అంటున్నారు. మహిళలు హెల్తీ లైఫ్‌ స్టైల్‌ కోసం రోజులో.. ఎనిమిది గంటలు కదులుతూనే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. క్రింది విధంగా ట్రై చేయండి.. మీ రోజూ వారి పనులతోనే మీరు యాక్టివ్‌గా ఉంటారు.