నిమ్మరసం ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. బరువు తగ్గడం మొదలు రోగనిరోధక శక్తి పెంపు వరకు ఎన్నో సమస్యలకు ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారు. అయితే నిమ్మరసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పడంలో ఎంత నిజం ఉందో… కొందరిలో ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
– అసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు నిమ్మ రసాన్ని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్య మరింత వేధిస్తుందని అంటున్నారు.
– దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం నిమ్మరసాన్ని తీసుకోకూడదు. దంతాల సున్నితత్వం ఉన్న వ్యక్తులు, నిమ్మరసాన్ని తీసుకోకూడదు. పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. దీనివల్ల దంతాలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది.
– నిమ్మకాయల్లో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎములక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
– కిడ్నీ సమస్యలున్న వారు కూడా ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది. దీర్ఘకాలికంగా మూత్ర పిండాల సమస్యలతో బాధపడేవారికి నిమ్మరసంతో సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయి.
– నోటి అల్సర్లతో బాధపడేవారికి కూడా నిమ్మరసం ప్రతికూల ప్రభావం చూపుతుంది. మౌత్ అల్సర్‌తో బాధపడేరు వారు నిమ్మరసం తీసుకోకూడదు. జిడ్డు చర్మానికి నిమ్మరసం మేలు చేస్తుంది.
– జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిమ్మరసంకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలోని యాసిడ్ కంటెంట్ కారణంగా కడుపులో మంటగా ఉంటుంది.