వాల్‌నట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. వీటిని అక్రోట్లు అని కూడా పిలుస్తారు.
డ్రై ఫ్రూట్స్‌లో ఇవి కూడా ఒకటి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపున వాల్‌నట్స్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన వాల్‌నట్స్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ తినొచ్చు.
వీటిని నానపెట్టి ఉదయం తినడం వల్ల గుండెకు చాలా మంచిది. హార్ట్ బ్లాక్స్ వంటివి ఏర్పడకుండా చేస్తుంది.
ఇవి తినడం వల్ల చర్మానికి, జుట్టుకు కూడా మంచి పోషణ అందుతుంది. జుట్టు బలంగా, దఢంగా తయారవుతుంది. అదే విధంగా దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. కాబట్టి చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.
పరగడుపున నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఇందులో ఐరన్ కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి రక్త హీనత సమస్య ఉన్న వారు వీటిని తింటే త్వరలోనే ఉపశమనం పొందుతారు.
ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ. కాబట్టి జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. మల బద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని తింటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. వీటిని తింటే.. మెదడు చక్కగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.