చందు కోడూరి హీరోగా, చరిష్మా శ్రీకర్ హీరోయిన్‌గా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘ప్రేమలో’. చందు కోడూరి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ కోడూరి నిర్మించారు. ఈనెల 26న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు శివాజీ రాజా విడుదల చేశారు. హీరో, దర్శకుడు చందు కోడూరి మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో భారీ తారాగణం, ఎలివేషన్స్.. టెక్నీషియన్స్ లేరు.. కానీ భారీ ఎమోషన్స్ ఉన్నాయి. కథలో బలం ఉంది. కాన్సెప్ట్‌లో దమ్ముంది. అందుకే ఈ సినిమాను చేశాను. తెలుగులో ఇప్పటివరకు ఎవ్వరూ ట్రై చేయని కథ ఇది. చిన్న పాయింట్‌ను నేచురల్‌గా తీశాను. మా టీమ్ సహకారంతో అవుట్‌ఫుట్ బాగా వచ్చింది. కంటెంట్ ఉండే చిత్రాలను సినీ లవర్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజున మా చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘ఇందులో మూడు రోజుల క్యారెక్టర్ చేశాను. చందు ప్యాషన్ చూసి.. నేను మూడ్రోజులు ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుందని. ఒకటిన్నర రోజులోనే కంప్లీట్ చేయమన్నాను. అతను పడ్డ కష్టానికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి చిన్న చిత్రాలను ఆదరించండి’ అని నటుడు శివాజీ రాజా చెప్పారు. సంగీత దర్శకుడు సందీప్ మాట్లాడుతూ, ‘పాటలు బాగా వచ్చాయి. ఆర్ ఆర్ దగ్గరుండి ఎలా కావాలో.. ఏం కావాలో చేయించు కున్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటు న్నాను’ అని తెలిపారు.