‘6 టీన్స్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘రిస్క్- ఏ గేమ్ అఫ్ యూత్’. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కష్ణ (జి కె) స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మనసా… చెలియా…’ వంటి వీడియో ఆల్బమ్స్‌తో పాపులర్ అయినా సందీప్ అశ్వా హీరోగా, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్య ఠాకూర్, జోయా ఝవేరి హీరోయిన్లు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సెకండ్ సింగల్ లిరికల్ వీడియో సాంగ్ ని నటుడు సత్యం రాజేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కష్ణ (జి కె) మాట్లాడుతూ,’గీత రచయిత వరికుప్పల యాదగిరి స్వీయ రచనలో ‘ఓ హసీనా!..’ పాటను పాడటం జరిగింది. టైటిల్‌కి తగ్గట్టుగా లైఫ్ గేమ్‌లో యూత్ చేసే తప్పులు, పొరపాట్లు వలన ఎలాంటి రిస్క్‌లో పడతారో ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని కలిగించే కథనంతో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా అందర్నీ అలరిస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని తెలిపారు.