
– గత మూడు రోజులలో రూ.5,48,440 /-, 46 మొబైల్స్ స్వాధీనం
– పేకాట సవరలపై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి
– జిల్లా ఎస్పి సింధు శర్మ, ఐపిఎస్
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలోని ఎవివిధ పోలీస్ స్టేషన్ల పరిదిలో పేకాట ఆడినందుకు గాను పలువురు పై కేసు నమోదు చేయడం జరిగిందనీ జిల్లా ఎస్పీ సింధు శర్మ ఒక ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశంలో పేకాట, జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే కామారెడ్డి టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712686109, 8712686133 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, 100 డైల్ లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.