
– పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ- మునుగోడు: ఈనెల 30 న జరిగే పోలింగ్లో కారు బటన్ పై బటన్ నొక్కితే కాంగ్రెస్ వాళ్లకు డిసెంబర్ 3న విడుదల ఫలితాలను చూసి గువ్వ గుయ్యమనేలా తీర్పును ఇచ్చేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సైదులు, రాజు , సందీప్ , నర్సింహా, మహంకాళి నర్సింహా నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం లో ప్రచారం నిర్వహిస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్లని రూపాయలకు గీతలు ఎక్కువ అన్న విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఉన్నది అని అన్నారు. ఇంట్లో గెలువనోడు రచ్చకెళ్లినట్టు మునుగోడు నియోజకవర్గం లో బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని ఓడ కొడతామని నియోజకవర్గంలోని ప్రజలు చెప్తుంటే బయటి నియోజవర్గంలో ప్రచారం కు వెళ్లడం ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హేళన చేశారు. పైసలు కట్టలతో ప్రజల్ని మోసం చేసే రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తారా.. ప్రజలకు అందుబాటులో ఉండి నియోజవర్గాన్ని అభివృద్ధి చేసే కూసుకుంట్లకు ఓటేస్తారా ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. 560 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన నాకు మరో అవకాశం ఇస్తే నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, బీఆర్ఎస్ నియోజవర్గ నాయకులు పాల్వాయి జూనియర్ గోవర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రావిరాల కుమారస్వామి , మండల నాయకులు అయితగొని విజయకుమార్, దుబ్బ రాజు, బీసం మల్లేష్ , యాసరాని దినేష్ , వెంకన్న , పోలే రాజు తదితరులు ఉన్నారు.