మ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోము..

If false propaganda is spread against Mmelye, don't let it go..నవతెలంగాణ – ఆర్మూర్ 

నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిర్విరామ కృషి చేస్తున్నారని, ఓర్వలేని  బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని  మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ అన్నారు. పట్టణ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజలకు తెలుసని అన్నారు.  నందిపేట్ లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాల్ పోస్టర్లు అంటించడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి సంతోష్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, జిల్లా అధికార ప్రతినిధులు అనిల్, గంగాధర్, మందుల బాలు తదితరులు పాల్గొన్నారు.