కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్‌ కష్టాలు తప్పవు

– మల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ ఇంటింటి ఎన్నికల ప్రచారం
– జడ్పీటీసీ ఎమ్మే శ్రీలత సత్యనారాయణ
నవతెలంగాణ-కొత్తూరు
కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె మల్లాపూర్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు వాటి ఫలాల గురించి ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 గంటల కరెంటు సరిపోతుంది అంటున్న కాంగ్రెస్‌ కావాలో 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న బీఆర్‌ఎస్‌ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మరింత అభివృద్ధి సాధించుకునేందుకు మరొకసారి బీఆర్‌ఎస్‌ అండగా ఉండాలని ఆమె ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌ విభిన్న రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు చిర్రా మధుసూదన్‌ రావు, మాజీ సర్పంచ్‌ రంగారెడ్డి, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షులు కడాల శ్రీశైలం, నాయకులు చెన్నారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, రైతు కోఆర్డినేటర్‌ గాంధీ నందన్‌ రెడ్డి, సుభాష్‌ రెడ్డి, కుమ్మరి రమేష్‌, కేదారేశ్వర్‌ రెడ్డి, చిర్ర యాదయ్య, చిర్ర పవన్‌, రఘు, శ్రీకాంత్‌, దయానంద్‌, చింటూ, మల్లేష్‌, నవీన్‌, యాదయ్య, మహిళలు చిర్ర సంతోష, కమలమ్మ, పుణ్యాలు, మంజుల తదితరులు పాల్గొన్నారు.