కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవు…

 – కొడి చర్ల తండాలో లో బీఆర్‌ఎస్‌ ఇంటింటి ఎన్నికల ప్రచారం.
 – మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సంతోష్ నాయక్.
నవతెలంగాణ- కొత్తూరు: కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సంతోష్ నాయక్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కొడి చర్ల తండాలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు వాటి ఫలాల గురించి ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు గంటల కరెంటు సరిపోతుంది అంటున్న కాంగ్రెస్ కావాలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న బీఆర్‌ఎస్‌ కావాలో తేల్చుకోవాల్సిన ఆసన్నం ఎదురైందని అన్నారు.  కెసిఆర్ భరోసా, సౌభాగ్య లక్ష్మి తదితర పథకాల గురించి ప్రజలకు వివరించి ఓటర్లను ఆకట్టుకున్నారు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు రైతన్నల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మరింత అభివృద్ధి సాధించుకునేందుకు మరొకసారి బీఆర్‌ఎస్‌ అండగా ఉండాలని ఆయన ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో షాద్నగర్ విభిన్న రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో అభివృద్ధికి చిహ్నమైన కారు గుర్తుపై ఓటేసి అంజన్న ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్ల ను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోహన్ నాయక్, బీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు రఘు వర్ధన్, మండల ఎస్టీసెల్ అధ్యక్షులు బిచ్చా నాయక్, శంకర్ నాయక్, సూర్య నాయక్, రవి నాయక్, తౌరియా నాయక్, బసు నాయక్, దేవ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.