కాంగ్రెస్‌కు ఓటేస్తే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్లే..

కాంగ్రెస్‌కు ఓటేస్తే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్లే..– రుద్రంగి రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-రుద్రంగి
కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే పోయిన దరిద్రాన్ని మళ్లీ నెత్తిన పెట్టుకున్నట్టేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుకు మద్దతుగా రుద్రంగిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మి మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న 13.5 లక్షల మంది ఆడబిడ్డలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన అర్హులైన వారందరికీ నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తామని తెలిపారు. దేశం, రాష్ట్రంలో 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. చల్మెడ లక్ష్మీనరసింహరావు మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రుద్రంగిలో ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కాలేజ్‌ని మంత్రి కేటీఆర్‌ సహాయంతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్‌, మాజీ జడ్పీ చైర్మెన్‌ తుల ఉమ, ఎంపీపీ స్వరూప మహేష్‌, జడ్పీటీసీ గట్ల మినయ్య, ఎంపీటీసీ మంచే లావణ్య రాజేశం, సెస్‌ డైరెక్టర్‌ ఆకుల గంగారాం, తదితరులు పాల్గొన్నారు.