ఆస్పత్రికి వెళ్లాలంటే అగచాట్లు తప్పవా?

ఆస్పత్రికి వెళ్లాలంటే అగచాట్లు తప్పవా?– రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనుల అవస్థలు
– బురదలో కాలినడకన కావిడిపై ఆస్పత్రికి తరలింపు
– అంబులెన్స్‌ను ఏర్పాటు చేసిన ఎస్‌ఐ రాజేష్‌
నవతెలంగాణ-బూర్గంపాడు
అనారోగ్య సమస్యతో అవస్థలు పడుతున్న ఓ మహిళను సకాలంలో ఆస్పత్రికి తరలించాలంటే ఆ గ్రామస్తులకు నరకం కళ్ళముందే కనబడుతోంది. ఆ గ్రామం నుంచి మైదాన ప్రాంత రహదానికి రావాలంటే సుమారు మూడు కిలోమీటర్ల మేర రహదారి సౌకర్యం లేకపోవడంతో… ఆ మహిళను ఆస్పత్రికి తరలించేందుకు గ్రామస్తులు కావిడిలో ఆమెను మోస్తూ… ఇటీవల కురిసిన వర్షంతో రహదారి బురదగా మారడంతో.. అందులో నడుచుకుంటూ అనేక అవస్థలు పడుతూ… కావిడిపై అనారోగ్యన గురైన మహిళను మోసుకుంటూ.. చివరకు మైదాన ప్రాంత రహదారికి చేరుకున్నారు.. ఈ సంఘటన బూర్గంపాడు మండలంలోని సారపాకలోని శ్రీరాంపురం ఎస్సీ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సారపాకలోగల గల అటవీ ప్రాంతంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీ రోడ్డు మార్గం సరిగా లేక గత కొన్ని సంవత్స రాలుగా గ్రామస్తులు అనేక అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈదారి మరింత అధ్వానంగా మారుతోంది. మోకాళ్లలోతు బురదలో వాహనాలు ఏమి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. సోమవారం ఆ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళకు ఆరోగ్య పరిస్థితి బాగాలేక కావడిపైనే ఒక మూడు కిలోమీటర్లు మోసుకోని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రాజేష్‌ అక్కడికి చేరుకొని అంబులెన్స్‌ పిలిపించి మహిళను ఆసుపత్రికి తరలించారు. దీంతో
ప్రాణాపాయం తప్పింది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ రాజేష్‌కు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. రోడ్డులేక పలువురు మృత్యువాత గురయ్యారని ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లారు.