ఆశీర్వదించండి సేవకుడిగా పనిచేస్తా

– కల్వకుర్తి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి
నవతెలంగాణ-ఆమనగల్‌
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నియోజకవర్గంలోని ఆమనగల్‌ కడ్తాల్‌ మండలాలతో పాటు ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మరోసారి మోసగిం చేందుకు మీముందుకు వస్తున్న వివిధ పార్టీల నాయకులకు తమ అమూల్యమైన ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. నియోజకవర్గ అభివద్ధే ధ్యేయంగా గత 35 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు చేస్తున్న తనను ఒకసారి ఎమ్మెల్యేగా అవ కాశం కల్పించాలని వేడుకున్నారు. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలతో పాటు కడ్తాల్‌ మండలంలోని మైసిగండి గ్రామంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రాందాస్‌ నాయక్‌ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆచారి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు కండె హరిప్రసాద్‌, తాలూకా కోకన్వినర్‌ గోరటి నర్సింహ, జిల్లా నాయకులు సాయిలాల్‌ నాయక్‌, రెడ్యా నాయక్‌, జంగం వెంకటేష్‌, కేకే శ్రీను, మండల అధ్యక్షులు మాన్య నాయక్‌, లక్ష్మణ్‌ రావు, శ్రీకాంత్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.