అభివృద్ధిని పట్టించుకోలేదు..

Ignored the development..– మాజీ ఎమ్మెల్యేపై బీజేపీ నాయకుల పైర్.. 
నవతెలంగాణ – ముధోల్
పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి ముధోల్ ను పట్టించుకోలేదని ముధోల్ బీజేపీ ప్రోగ్రాం కమిటీ ఇంచార్జి రాజేష్ బాబు ఆరోపించారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో కాంగ్రెస్ మోసాలపై బుధవారం బిజేపి పార్టీ చార్జిషీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలలో కాళేశ్వరం 28 ప్యాకేజీ పనులను పూర్తి చేయించలేదని అన్నారు. ఎడ్ బిడ్, వడ్తల్ గ్రామాలకు కాళేశ్వరం నీళ్లు తెస్తా  అని  హామీనిచ్చిన మాజీ ఎమ్మెల్యే మరిచిపోయారన్నారు. తన పదివి కాలంలో నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాన్ని  పూర్తి చేయలేక పోయాడని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంపై లేని ప్రేమ ను చూపటం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సిసి రోడ్ల కోసం మంజూరు చేస్తే, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తన పదవి కాలంలో చేసిన పనులపై  బహిరంగ చర్చకు మాజీఎమ్మెల్యే రావాలని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో ఆయన ఆరోపణలు గుప్పించారు. ఈ సమావేశంలో బిజెపినాయకులు నర్సాగౌడ్, మోహన్ రేడ్డి, రాంచందర్, దత్తాద్రి, శ్రీనివాస్, రవి ,ముత్యం, శ్యామ్ రావు, సాయిరాం,అంబర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.