రైతుల సమస్యలు విస్మరించి….

దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబరాలా? వైస్‌ ఎంపీపీ అశోక్‌
నవతెలంగాణ-గణపురం
రైతుల సమస్యలు పక్కకు పెట్టి దశాబ్ది ఉత్సవాలు పేరుతో సంబరాలు చేసుకోవడం సరికాదని వైస్‌ ఎంపీపీ విడిది నేని అశోక్‌ అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు రేపాక రాజేందర్‌ అధ్య క్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు దినోత్సవ పేరుమీద వేడుకలు నిర్వహించిన అధికార పార్టీ నాయకులు రైతుల సమస్యలను విస్మరించి కేసీఆర్‌ భజన చేయడం సిగ్గుచేటు అన్నారు. ఓట్ల కోసం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధ నాన్ని దుర్వినియోగం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. రైతులకు రుణమాఫీ, వడగళ్ల వానకు పంట నష్టం, పోయిన రైతులకు పదివేల ఆర్థిక సహాయం సబ్సిడీ విత్తనాల, సబ్సిడీ ఎరు వులు, పంట బీమా మీద ఎలాంటి హామీ ఇవ్వ కుండా పార్టీ కార్యకర్తలే రైతు వేదికపై సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా రైతు సమస్యలను గుర్తించాలని, లేనియెడల రాబోవు ఎన్నికల్లో పరాభావం తప్పదని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దూడపాక శంకర్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కష్ణ,మండల నాయకులు గుర్రం సదానందం నేరెళ్ల రాజు సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ జోడు ప్రదీప్‌, యువసేన నాయకులు పోశాల మహేష్‌ పెండ్యాల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.