– వేలాది మందితో హైదరాబాదును దిగ్బంధిస్తాం
– ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రూ.6,500 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ విద్యార్థులకు కదం తొక్కారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ధర్నాకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వలమల్ల ఆంజనేయులు, ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ విద్యారం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం వలన వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదివే విద్యార్థుల పరిస్థితి కడు దయనీయంగా మారి ఉన్నత చదువులకు దూరం కావలసిన పరిస్థితి రాష్ట్ర విద్యార్థి లోకానికి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ విద్యార్థుల పట్ల, విద్య రంగా అభివృద్ధి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే స్కాలర్షిప్, ఫీజు మెంబర్స్ మెంట్, హాస్టల్ విద్యార్థుల మిస్ కాస్మోటిక్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే నేటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని హెచ్చరించారు. విద్యారంగం పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలని కోరారు. నిధులు ఇవ్వకుండా, ప్రభుత్వం నిర్లక్యం చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ నెల 27లోపు నిధులు విడుదల చేయకపోతే చలో ఇందిరాపార్క్ నిర్వహిస్తామని వేలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ దిగ్భందిస్తామని అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రజా ప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామని సంతోష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నాకు ముందు జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షులు రమావత్ శోభన్, నాయక్,జిల్లా కోశాధికారి గాదెపాక సూర్య తేజ,జిల్లా కార్యవర్గ సభ్యులు సురిగి వినయ్, ఇస్కిలా మహేందర్,చాపల విప్లవ్, జిల్లా సమితి సభ్యులు ఎర్ర వినయ్,వట్టెపు శివకుమార్, కాంపల్లి భాను,రూపవత్ విష్ణురామావత్ శ్రీకాంత్, ధనవత్ మనోజ్, లావుడి శ్రీధర్, బొమ్మకంటి శివప్రసాద్, బోగరి రవితేజ,అరుణ్,వీరేష్, శ్రీపాదం, దశరథ్, సిద్దు, మాధవి, అంజలి, అనూష, లక్ష్మి, ప్రియా, స్వాతి, రేష్మ, సోనియా, శ్రీజ తదితరులు వున్నారు.