రూ.1500 కోట్ల సమీకరణలో ఐఐఎఫ్‌ఎల్‌

– ఎన్‌సిడిలపై 9 శాతం వడ్డీ
హైదరాబాద్‌ : నాన్‌ కన్వర్టేబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సిడి)లు జారీ చేయడం ద్వారా రూ.1500 కోట్లు సమీకరించాలని నిర్ణయించి నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ రమీలా మాట్లాడుతూ.. ఈ బాండ్లపై 9 శాతం వరకు వడ్డీ అందించనున్నట్లు తెలిపారు. రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితితో ఎన్‌సిడిలను జారీ చేస్తున్నామన్నారు. కనీస పెట్టుబడి రూ.10,000 పెట్టాల్సి ఉంటుందన్నారు. 2023 మార్చి 31 నాటికి సంస్థ లోన్‌ అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ రూ.64,638 కోట్లుగా ఉందన్నారు. ఇందులో 95 శాతం రుణాలు కూడా రిటైల్‌ రంగానివేనని అన్నారు. సంస్థ స్థూల ఎన్‌పిఎలు 1.8 శాతంగా ఉన్నాయన్నారు. తమ వ్యాపారంలో తెలుగు రాష్ట్రాలు కీలక వాటాను కలిగి ఉన్నాయన్నారు.