కేటీఆర్‌కు మద్రాస్‌ ఐఐటీ ఆహ్వానం

కేటీఆర్‌కు మద్రాస్‌ ఐఐటీ ఆహ్వానంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంట్రపెన్యూరల్‌ ఫెస్టివల్‌లో ప్రసంగించేందుకు తమ సంస్థకు రావాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కే.తారకరామారావుకు ఐఐటీ మద్రాస్‌ ఆహ్వానం పలికింది. ఈ మేరకు శుక్రవారం కేటీఆర్‌కు ఆహ్వానపత్రికను పంపింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యూరల్‌ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఐఐటీ మద్రాసు ఆహ్వానిస్తున్నది. అంట్రపెన్యూరల్‌ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాలని కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో కోరింది. దేశంలోనే అంతర్జాతీయ గుర్తింపు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ కలిగిన ఏకైక కార్యక్రమం ఇది. ఈసారి సమ్మిట్‌కు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాలకృష్ణన్‌, హెచ్‌సీఎల్‌ సహ వ్యవస్థాపకులు అజరు చౌదరి, తదితరులు హాజరుకానున్నారని ఐఐటీ మద్రాసు పేర్కొంది.