నలంద పాఠశాలలో ఐఐటి మెగా ఒలంపియాడ్ పరీక్ష

నవతెలంగాణ- ఆర్మూర్:  పట్టణంలోని మామిడిపల్లి  నలంద హైస్కూల్లో మంగళవారం మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు.గ్లోబల్ ఒలింపియాడ్. ఆరవ తరగతి నుండీ ఫ్యాక్ట్ ఒలంపియాడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండే  మ్యాథ్స్, సైన్స్ ,రీజనింగ్ అంశాలలో  శిక్షణను అందిస్తున్నామని, ఈ ఒలంపియాడ్ పరీక్షల ఫలితంగా  భవిష్యత్తులో విద్యార్థులకు ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడంలో ఈ అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని. ఈ ఆధునిక విద్యా విధానం అనేది  పోటీతో కూడుకున్నదని ఈ పోటీ ప్రపంచంలో నా నలంద విద్యార్థులు అంతా ప్రథమ స్థానంలో నిలవాలని ఉద్దేశంతో మా విద్యార్థులకు మూడవ తరగతి నుండే ఐఐటీలో శిక్షణనిస్తూ మ్యాథ్స్,సైన్స్ రీజనింగ్ వంటి అంశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఇలా పాఠశాల స్థాయి పరీక్ష లే కాక రాష్ట్రస్థాయిలో కూడా పరీక్షలు రాసేలా శిక్షణ అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంప్రసాద్ ,సాగర్ ,,గ్లోబల్ ఒలింపియాడ్ ఇంచార్జీలు వాసవీ మేడమ్, అక్షయ్ సర్, శిరీషా ,ఫాక్ట్ ఒలింపియాడ్ ఇంచార్జీలు హన్మండ్లు , అశోక్  సందీప్ , ప్రవీణ్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.