ఉమా హారతి ఆలిండియా 3వ ర్యాంక్
జయసింహారెడ్డి రావులకు 217,
బొల్లం ఉమామహేశవర్‌రెడ్డి 270వ ర్యాంక్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సివిల్స్ ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ పూర్వ విద్యార్థులు విజయం సాధించారు. మంగళవారం విడుదలైన యూపీఎస్‌సీ ఫలితాల్లో ఐఐటీహెచ్ విద్యార్థులు ముగ్గురు ఆలిండియా స్థాయిలో మంచి ర్యాంకు సాధించారు. ఐఐటీ హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 2017 బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన ఉమా హారతి ఆల్ ఇండియా మూడో ర్యాంకు, విజయసింహారెడ్డి రావుల(ఎలక్ట్రికల్ ఇంజనీర్ 2019) 217వ ర్యాంకు, బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి (మెకానికల్ అండ్ ఎరోస్పేస్ ఇంజనీర్ 2016) 270వ ర్యాంకు సాధించారు. గతంలోనూ ఐఐటీహెచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సివిల్స్‌లో విజయం సాధించారు. ఐఐటీహెచ్‌లో నేర్చుకున్న వివిద నాయకత్వ పాత్రలలో దేశానికి సేవ చేసే అవకాశాన్ని పొందేందుకు తమ వంతు కృషి చేశారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొపెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు దేశానికి సేవ చేయడంతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. దేశంలో అత్యంత కష్టతరమైన, అత్యంత గౌరవనీయమైన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ టెస్ట్‌లో విజయం సాధించడం అభినందనీయమ న్నారు. ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన ఉమా ఐఐటీహెచ్ డీన్ డాక్టర్ ముద్రికా ఖండేల్వాల్ మాట్లాడుతూ సమాజానికి, దేశానికి సేవ చేసే ఉన్నత స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. బాధ్యత కల్గిన వ్యక్తులుగా రూపుదిద్దుకుంటున్నందున ఎంతో గర్వంగా ఉందన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొపెసర్ ఎస్ సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ మా విద్యార్థులలో అకడమిక్ అండ్ రిసెర్చ్ ఎక్సలెన్స్‌ను పెంపొందించడమే కాకుండా సమాజం, దేశం పట్ల బాధ్యతాయుత భావాన్ని పెంపొందించామ న్నారు. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొపెసర్ ఉమాశంకర్ మాట్లాడుతూ అద్యుత పనితీరుతో సివిల్స్‌లో విజయం సాధించారన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొపెసర్ శివగోవింద్‌సింగ్ మాట్లాడుతూ మా పూర్వ విద్యార్థులు సివిల్స్ సాధించడం ఎంతో గర్వించదగిన విషయమన్నారు. మెకానికల్ అండ్ ఎరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి రామ్‌జీ మాట్లాడుతూ ఐఐటీహెచ్ శక్తివం తమైన పర్యావరణ వ్వవస్థ విద్యార్థులు పరిణితి చెందేందు కు దోహదపడిందన్నారు.
ఐఐటీహెచ్‌లో పొందిన ప్రేరణతో సివిల్స్ సాధించా
ఇది నా ఐదో ప్రయత్నం. ఇది సవాలుతో కూడుకున్న ప్రయాణం అనడం లో సందేహంలేదు. నేను నా వ్యుహానికి క ట్టుబడి ఉన్నాను. నా ప్రేరణ నా రోజువా రి లక్ష్యాలను పూర్తి చేయడం, సమతుల్య తను కనుగొనడం కీలకం. శారీరక, మా నసిక ఆరోగ్యాన్ని జాగ్రతగా చూసుకోవడం చాలా ముఖ్యం. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే వాళ్లలకు నేను మూడు సందేశాల ను ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్కడ తప్పు చేస్తున్నారో కనుగొవడానికి ప్రయత్నించాలి. సరైన మార్గంలో ఎలా చేయాలో అర్ధం చేసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి.
– ఉమా హారతి, సివిల్స్ 3వ ర్యాంకర్
ఐఐటీహెచ్‌లో ఉన్న అవకాశాలే ఈ ఘనతకు కారణం
ఐఐటీ హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలే నేను సివిల్స్ సాధించడానికి కారణమైంది. సివిల్స్ రాసే అభ్యర్థులు తనను తాను బాగా అర్ధం చేసుకోవడం, తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. లెక్కించిన రిస్క్‌లను తీసుకోవడం వల్ల మనం ముందుకు సాగడానికి సహాయపడుతుంది. డాక్టర్ కోటారోతో పరిశోధనా పత్రం, ఐఐటీహెచ్‌లో చేపట్టిన స్వతంత్ర ప్రాజెక్టు ఇంటర్య్వూలో ప్రముఖ చర్చనీయాంశాలుగా అయ్యాయి.
– జయసింహారెడ్డి, సివిల్స్ 217వ ర్యాంకర్
సివిల్స్ సాధనలో ఐఐటీహెచ్ ఎంతో ఉపయోగపడింది
ఐఐటీహెచ్‌లో పీర్ గ్రూపు ఖచ్చితంగా అదనపు ప్రయోజనం చేకూర్చింది. సమస్యలకు మెరుగైన మార్గంలో పరిష్కారాలను పొందేందుకు ఇది దోహదపడింది. ఐఐటీహెచ్‌లోని విద్యా వేత్తలు ఖచ్చితంగా ఈ మైలురాయిని సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇది చాలా పోటీ పరీక్ష కాబట్టి ప్లాన్ బిని కల్గి ఉండండీ.
– ఉమామహేశ్వర్, సివిల్స్ 270వ ర్యాంకర్