‘గ్రామీణ విద్యార్థులకు అందని ద్రాక్షగా ఐఐటీలు’

ప్రపంచస్థాయి ఇంజనీరింగ్‌ సాంకేతిక విద్యకు చిరు నామాగా భారతీయ ఐఐటీలు బాసిల్లుతున్నాయి. భవిష్యత్తు తరాలకు కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో భార తీయ ఐఐటీల పాత్ర ప్రముఖమైనది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకి సీఈఓ లని దేశానికి రాజకీయ నాయకులను, శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను, అధి కారులను అందించిన ఘనత ఐఐటీలకే దక్కుతుంది.1940 సంవ త్సరంలో నలిని రంజన్‌ సర్కార్‌ అధ్యక్షతన 22 మంది నిపుణులతో కూడిన కమిటీ భారత దేశవ్యాప్తంగా ఆధునిక సాంకే తిక పరిజ్ఞానంతో కూడిన ఇంజనీరింగ్‌ విద్యను విద్యార్థులకు అందించే విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. స్వాతంత్య్రనంతరం 1950 మే 15 న దేశంలో మొట్టమొదటి ఐఐటి హిజ్లి డిటెన్షన్‌ క్యాంప్‌ ఖరగ్పూర్‌, పశ్చి మ బెంగాల్‌లో ఏర్పాటు చేశారు. దీనిని భార తదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 18 ఆగస్టు 1951లో ప్రారంభించారు.
నలిని రంజన్‌ సర్కార్‌ ప్రతిపా దన మేరకు దేశవ్యాప్తంగా నాలుగు ఐఐటీలను బాంబే, మద్రాస్‌, కాన్పూర్‌, ఢిల్లీలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 15 సెప్టెం బర్‌ 1956లో భారతదేశపు మొట్టమొదటి ప్రధా నమంత్రి జవహర్లాల్‌ నెహ్రూ జాతి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రపంచస్థాయి విద్యా లయాలు దేశంలో ఏర్పాటు చేయాలని పార్లమెంటులో చర్చించి చట్టం చేశారు. మన ఐఐటీలలో చదివి ప్రపంచ స్థాయి లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో సుందర్‌ పిచారు, ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, సచిన్‌ బన్సాల్‌, ప రాగ్‌ అగర్వాల్‌ అరవింద్‌ కృష్ణ రాజా సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు, రాజ కీయ నాయకుల్లో అజిత్‌ సింగ్‌ మనోహర్‌ పరికర్‌, జయరాం రమేష్‌ అలోక్‌ అగర్వాల్‌ జయంత్‌ సిన్హా అరవింద్‌ క్రేజీవాల్‌లు ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ పరిధి లో ఐఐటీ కౌన్సిల్‌ సారథ్యంలో ఇవి పనిచేస్తాయి. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ. 9661.50 కోట్లను ఐఐటీల కోసం కేటాయించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఐఐటీలకు కేంద్ర బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించి పరిశోధన రంగాన్ని మరిం తగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
ఈ ఐఐటీలలో కేవలం 17385 మంది విద్యార్థులు మాత్ర మే విద్యను అభ్యసించే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఐఐ టీలలో చేరడానికి విద్యార్థులు ఐఐటి జేఈఈ మెయిన్స్‌ అడ్వాన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణతతో పాటు ఉన్నత మార్కులు సాధించాల్సి ఉంటుంది. భారతదేశంలో అత్యధిక మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవు తారు. గత సంవత్సరం 11,13,325ల విద్యార్థులు ఈ పరీక్షకు హాజర య్యారు. దీన్నిబట్టి ఐఐటీలో సీట్‌ కోసం విద్యార్థుల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అవగతమవుతుంది.దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల్లో అ త్యంత కఠినమైన పోటీపరీక్షగా జేఈఈ అడ్వాన్స్‌ మెయిన్స్లను చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్‌ పోటీ పరీక్ష రెండవ స్థానంలో ఉండడం విశేషం. గత దశాబ్ద కాలంలో కేవలం 7 ఐఐటీ లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయడం గమనార్హం. జూన్‌ 2023లో భారత ప్రభుత్వము, టాంజానియా ప్రభుత్వం కలిసి భారతదేశం వెలుపల మొట్టమొదటి ఐఐటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఐఐటి మద్రాస్‌కు సాటిలైట్‌ క్యాంపస్‌గా ఉండనుంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి దేశంలో భారతదేశం గుర్తింపు పొందింది. అత్యధిక జనాభాకు సరిపడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణలను అందించాల్సిన బాధ్యత ఐఐటీలపై ఉంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఐఐటీలను పెంచాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభు త్వంపై ఉంది. భారతదేశంలో అత్యంత నాణ్యమైన ఇంజనీరింగ్‌ విద్యను అందించడంలో ఐఐటీలు ప్రతిసారి ముందుంటున్నాయి. 2023 ఎన్‌ఐఆర్‌ ఎఫ్‌ ర్యాంకింగ్‌లో అత్యున్నత ఇంజనీరింగ్‌ విద్యను అందించే కళాశాలల్లో మొదటి పది స్థానాల్లో 8 ఐఐటీలకే దక్కాయి. మొదటి మూడు ర్యాంకుల్లో ఐఐటి మద్రాస్‌, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ఉన్నాయి. ఐఐటి కాన్పూర్‌లో చదివిన విద్యార్థికి సంవత్సరానికి రూ. 4 కోట్ల జీతం వచ్చిందంటే ఐఐటి విద్యార్థులపై కార్పొరేట్‌ కంపెనీలకు ఉన్న ఆసక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. ఐఐటీలలో చదివే విద్యార్థుల సరాసరి జీతం సంవత్సరానికి 30 నుండి 40 లక్షల వరకు ఉంటుంది. అందుకే ఐఐటీలకి అంత క్రేజీ.
గత కొన్ని సంవత్సరాలలో ఐఐటీల్లో చేరే విద్యార్థుల పరిశీ లిస్తే 95శాతం మంది విద్యార్థులు కోచింగ్‌ తీసుకున్న వారు మా త్రమే ఐఐటీలలో చేరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదు వుకుంటున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి దేశంలోని అత్యంత నాణ్యమైన ఇంజనీరింగ్‌ విద్య అందని ద్రాక్షగా ఉంది. ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే ఐఐటి విద్య అందుతుందనే విమర్శ కూడా ఉంది. కోచింగ్‌ సెంటర్లలో లక్షలు వెచ్చిస్తే గాని విద్యార్థులు ఐఐటీలలో చేరే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యల్లో ఐఐటీ కోచింగ్‌ సెంటర్‌ వెలవడం వాటిలో విద్యార్థుల కోచింగ్‌ కోసం తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు చేయడం జరుగుతుంది. విద్యార్థుల పై మానసిక ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. ‘పేద విద్యార్థులకు ఐఐటీలలో చేరడం ఒక కలగానే మిగిలి పోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రభుత్వ ఆధీనంలోనే విద్యార్థులకు ఐఐటి జేఈఈ కోచింగ్‌ సెం టర్లు ఏర్పాటు చేసి అత్యున్నత ప్రతిభగలిగిన విద్యార్థులకు అవకా శాలు కల్పించేలా చేయడం ఆవశ్య కం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు లబ్ధిపొందే అవకాశముంది. సామా న్యులకు కూడా ఐఐటీలలో సీటు పొందే అవకాశముంది.
1953 నుండి ఇప్పటివరకు భారతదేశంలోని ఐఐటీలలో చది విన వారు దాదాపుగా 25 వేల మంది అమెరికాలో స్థిరపడ్డారని సమాచారం. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం మీద వలస జరు గుతుంది. భవిష్యత్‌ భారత్‌ ప్రపం చంలోనే అత్యున్నత ఆధునిక సాంకే తిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవా లంటే ఈ మేదో వలసల్ని నివారించాల్సి ఉంది. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ -2023 ప్రకారం మొదటి 100 మంది టాప్‌ యాంకర్ల లో 62 శాతం, 1000 యాంకర్లలోపు 36శాతం మంది వేరే దేశాలకు వలస వెళుతున్నారు. భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూ తన ఐఐటిలను ఏర్పాటు చేయాలి. మేదో వలసలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీ ఐఐటి కౌన్సిల్‌, యుజిసి చైర్మన్‌, ఐఎస్‌ఐ ఆర్‌ చైర్మన్‌ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో ఏర్పాటు చేసి చర్య లు తీసుకోవాలి.

– పాకాల శంకర్‌ గౌడ్‌
9848377734