– ఏపీఎం కృష్ణా రెడ్డి
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన రోజు నుండి మూడు రోజుల్లోనే ప్రభుత్వం వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని, రైతులంతా ఐకేపీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం కృష్ణా రెడ్డి అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని పొతారం,అరె పల్లి,గొసాన్ పల్లి గ్రామాలతో పాటు రామేశ్వరం పల్లి, కమ్మర్ పల్లి, బల్వంతపూర్న,రేండ్ల గడ్డ, పద్మశాలి గడ్డ, హాసన్ మీరపూర్, గంభీర్ పూర్, శిలాజీనగర్, వెంకటగిరి తండా గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుని మోసపోకుండా ప్రభుత్వం కేటాయించిందని,రైతులంతా ఐకేపీ సెంటర్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలన్నారు.కార్యక్రమంలో సీసీ అక్బర్, పర్శరాములు, నర్సింలు, భాగ్యలక్ష్మి,వివోఏలు, ఐకేపీ సిబ్బంది, రైతులు , గ్రామస్తులు ఉన్నారు.