మేడారం జాతర కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 

– టోల్ ఫ్రీ 1800-425-0620 
నవతెలంగాణ -తాడ్వాయి 
మేడారం మహా జాతర కంట్రోల్ రూమ్ ను  శుక్రవారం మేడారం ఐటీడీఏ క్యాంప్ కార్యాలయం లో  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మేడారం జాతరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం అని భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ (1800-425-0620)  ను సంప్రదించవచ్చు అని  ఈ టోల్ ఫ్రీ నంబర్ 19 వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుందని అన్నారు. జాతర లో మొత్తం 382 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం అని మూడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అందుబాటులో ఉంటాయని జాతర లో ఎనిమిది జోన్లుగా, 42 సెక్టార్స్ గా విభజించి ప్రతి జోన్ లో నోడల్ అధికారి, జోనల్  అధికారి, సెక్టోరల్ అధికారి విధులలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో   జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ, అదనపు కలెక్టర్ ( రెవెన్యూ ) వేణు గోపాల్, జిల్లా ఈ-డిస్ట్రిక్ మేనేజర్ దేవేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.