
– పాఠశాల, కళాశాల ప్రవేశాలకై దరఖాస్తులకు ఆహ్వానం
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : ఇల్లందు పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, ఇంటర్ కళాశాల విద్యాప్రమాణాలు కార్పోరేట్ కు ధీటుగా అంతర్జాతీయ స్థాయి లో ఉన్నాయని, 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆసక్తి గల 5వ తరగతి, ఆపై తరగతి చదివే విద్యార్థులు పాఠశాలలో, ఇంటర్ మొదటి చదివే విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ అన్నారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సి ట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖనమ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన పాఠశాల, కళాశాల అడ్మిషన్లకై ఆళ్ళపల్లి మండల కేంద్రంలోని మసీదు ప్రాంగణంలో ముస్లింలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదవ తరగతి, ఆ పై తరగతులు చదివే ముస్లిం విద్యార్థులు 51, క్రిస్టియన్స్ 5, జైనులు 01, పార్సీలు 01, బౌద్ధులు 01, సిక్కులు 01, ఎస్సీలు 5, ఎస్టీలు 03, బీసీలు 10, ఓసీలు 02 గా సీట్లు ఉన్నాయని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 18వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్ లైన్ చేసుకోవాలని కోరారు. ముస్లిం క్రిస్టియన్ విద్యార్థుల సీట్లను ప్రాధాన్యత క్రమంలో వచ్చిన దరఖాస్తుల ప్రకారం భర్తీ చేయబడతాయని, నాన్ మైనార్టీ విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బిసి ఓసి సీట్లను ఏప్రిల్ నెలలో 24వ తేదీ నుంచి 30 వరకు లాటరీ పద్ధతి ద్వారా భర్తీ చేయబడుతాయని చెప్పారు. అలాగే ప్రస్తుతం పాఠశాలలో 6వ తరగతి 20, 7వ తరగతి 35, 8వ తరగతి 22 ముస్లిం మైనార్టీ సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ముస్లిం మైనార్టీ విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నామని తెలిపారు. కావున ఆసక్తి, అర్హత గల గల విద్యార్థి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇతర వివరాలతో దరఖాస్తులను టీఎంఆర్ఈఐఎస్. తెలంగాణ.జిఓవి.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో సమర్పించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్స్ 91103 60408, 7331170863లను సంప్రదించాలని చెప్పారు. ఈ సదవకాశాన్ని మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.