అక్రమ అరెస్టులు బూటకపు ఎన్‌ కౌంటర్లు

– కాంగ్రెస్‌ ఏడాది విజయోత్సవాలు ఇవేనా? : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా విమర్శించారు. ”అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు బూటకపు ఎన్‌ కౌంట్లర్లు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయి. అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారు. ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజవంతంగా తూట్లు పొడిచారు. బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు. ఇదేనా ఏడాది పాలన విజయోత్సవాలు” అని ఎద్దేవా చేశారు.