నవతెలంగాణ-బెజ్జంకి
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం నిరుద్యోగులను అమలు చేయని హామీల ఇచ్చి మోసం చేసిందని..హామీలను అమలు చేయాలని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ లు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జీ ఎల శేఖర్ బాబు ఒక ప్రకటనలో శుక్రవారం అసహనం వ్యక్తం చేశారు.వివిధ శాఖల్లో అసంపూర్తిగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఇంఛార్జి ఉద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఉద్యోగ నోటిఫికేషన్ లు జారీ చేయాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ అధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని శేఖర్ బాబు హెచ్చరించారు.