అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం..

Illegal arrests are undemocratic.– సమాచార లోపమా..?
– ఇంటెలిజెన్స్ వైఫల్యమా..?
– పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ 
 గ్రూప్ 2,3 ఆస్పరెంట్స్ గ్రూప్ టు వాయిదా వేయాల ని డిమాండ్ తో హైదరాబాదులో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న సందర్భంగా పీడీఎస్ యూ – పివైఎల్ సంఘాలు ఆ కార్యక్రమంలో లేనప్పటికీ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని, పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు పిలుపునిచ్చిన తమకు సంబంధం లేని కార్యక్రమాలలో కూడా తమను అరెస్టు చేయడం తమ రోజువారి కార్యకలాపాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పోలీసులు భంగం కలిగించినట్లే అవుతుంది అన్నారు.భవిష్యత్తులో ఇట్లాంటి ప్రియువెంట్ అరెస్ట్ లో ప్రభుత్వం పున ఆలోచన చేయాలి అని అన్నారు.లేకుంటే తమ కార్యచరణ దానికి అనుగుణంగా ఉంటుందని తెలియజేశారు.