– సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్
నవతెలంగాణ – అచ్చంపేట : పోలీసుల అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరు ఖండించాలని సివిల్ సప్లై ఆమాలీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. సివిల్ సప్లై కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. మంగళవారం సమ్మెను పోలీసులు విచ్చిన్నం చేసి అరెస్టు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్లేష్ మాట్లాదారు. ఈ సమ్మెను జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపి అరెస్టు చేయించడం సిగ్గుచేటు అన్నారు. ఎగుమతి, దిగుమతి కింటాలు బస్తా మీద 26 రూపాయల నుండి 29 రూపాయల వరకు పెంచాలని, బోనస్ 6500 నుండి 7500 కు పెంచాలని డిమాండ్ చేశారు. వారికిచ్చే యూనిఫార్మ్స్ కుట్టుకూలీ 1300 నుండి 1600 ఇవ్వాలని, మహిళా కార్మికులు పనిచేస్తే వారికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం చేసుకొని సంవత్సరం కావస్తున్న అమలు చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా సివిల్ సప్లై హమాలీల కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎం శంకర్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్, సివిల్ సప్లై హమాలీ కార్మికులు పెద్ద జంగయ్య, చంద్రయ్య, రేనయ్య, తిరుపతయ్య, బాలస్వామి, సైదులు, బక్కయ్య,, నారయ్య, ఎస్ జంగయ్య, రాము, తదితరులు, పాల్గొన్నారు