
అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరనీ పిడిఎస్యు ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పై విచారణ జరిపించాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లను విడుదల చేయాలని పలు అంశాలతో పిడిఎస్యు రాష్ట్ర కమిటీ చలో అసెంబ్లీ కి పిలుపునిస్తే. రేవంత్ రెడ్డి సర్కార్ భయపడి పోలీసులతో విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇందుకు వ్యతిరేకంగా సోమవారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వానికి విద్యార్థులపై ఎలాంటి ప్రేమ లేకుండా కక్ష పూరితంగా ఫుడ్ పాయిజన్ ద్వారా వందలాది మంది విద్యార్థులు నేలరాలుతున్న అనేక ఘటనలు జరుగుతున్న, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగానే విద్యార్థులపై వ్యతిరేక చర్యలు పాల్పడుతుందని, దీనికి నిరసనగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిడిఎస్యు రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ముట్టడి కి పిలుపును ఇస్తే ముట్టడిని నిర్వీర్యం చేయాలని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేయడం అప్రజసమ్యం అని వారన్నారు .ఈ సందర్భంగా *సిపిఐ ఎంఎల్ మాస్లిన్ ప్రజా పందా సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ , పిడిఎస్సి రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గణేస్ లన అక్రమంగా అరెస్టు చేయడం మేధావులు విద్యార్థులు నాయకులు అందరూ కూడా ఖండించాలని వారు అన్నారు. వెంటనే విడుదల చేయాలని విద్యార్థులకు పౌష్టికమైన ఆహారం పెట్టీ ,స్కాలర్షిప్ విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని లేనిపక్షంలో పోరాటాలను మరింత ఉద్రోహితం చేస్తామని అరెస్టులు కేసులు నిర్బంధాలు విప్లవ నాయకులకు పోరాటాలను ఆపలేవని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్దు వినయ్ నితిన్ నిఖిల్ సింహాద్రి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.