
సర్పంచుల అక్రమ అరెస్టులు సరికాదని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మోహన్ రాథోడ్ అన్నారు. శుక్రవారం మోహన్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో అనేక అభివృద్ది పనులు చేసి ఒక్కొక్క సర్పంచ్ లక్షల్లో అప్పులు వాయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నామన్నారు. మా యొక్క వేదనను గాంధేయ మార్గంలో ప్రభుత్వానికి తెలియపరుస్తామని ఈరోజు 02/08/ 2024 రోజున హైదరాబాద్ సెక్రెటరేత్ ను ముట్టడించి మా బాదలను ప్రబుత్వానికి విన్నవించుకునే కార్యక్రమంలో భాగంగా వెళ్లేది ఉండే ఇట్టి కార్యక్రమానికి పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం సర్పంచులు చేసిన పనులకు న్యాయంగా రావలసిన బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయమైన డిమాండ్లకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి ఆదుకోవాలని అన్నారు. అక్రమంగా సర్పంచ్లను నిర్బంధించడాన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు నాయకులు కార్యకర్తలు ఖండించి మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.