అక్రమ అరెస్టులను ఖండించాలి

– సీపీఐ ఎంఎల్ ప్రజాపంధా
నవతెలంగాణ తాడ్వాయి
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రజా గొంతుకలు అయినటువంటి ప్రజాస్వామ్యవాదులను ముందస్తుగా రెస్ట్ చేయడం సిగ్గుచేటు అని సిపిఐ ఎమ్ఎల్ ప్రజాపoధా డివిజన్ సహాయ కార్యదర్శి ఏ ప్రకాష్ అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా డివిజన్ కార్యదర్శి బాలరాజును రాత్రి రెండు గంటల సమయంలో తన ఇంటి వద్ద నుండి అక్రమంగా అరెస్టు చేసి నిజాంసాగర్ మండలం పోలిష్ స్టేషన్ కు తరలించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మంత్రులు ముఖ్యమంత్రులు వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్న సందర్భంలో అక్కడి పోలీసులకు అధికారులకు ప్రజాప్రతినిధుల నుండి మార్కులు సంపాదించడానికి ప్రజాస్వామిక గొంతుకానునొక్కి వేయడానికి నిరసన గలలను అణచడానికి మాత్రమే ముందస్తుగా ప్రజాసంఘాల నాయకులు విప్లవ పార్టీ నాయకులను ప్రజా సంఘాల నాయకులనుఅరెస్టు చేసి నిర్బంధించడం సరికాదన్నారు. ఇలాంటి నియంతృత్వ చర్యల వలన మనిషి జీవించే హక్కులు హరించబడుతున్నాయన్నారు. అణిచివేత ఆ ప్రజాస్వామిక చర్యలను ఎదుర్కొని రాజ్యాంగ హక్కులను పోరాటం ద్వారానే కాపాడుకోవాలి ఇలాంటి నిర్బంధాలను ముందస్తు అరెస్టులను సిపిఐ ఎంఎల్ ప్రజాపందా తీవ్రంగా ఖండిస్తున్నది ఈ విలేకరుల సమావేశంలో డివిజన్ నాయకులు శ్రీను నారాయణ తదితరులున్నారు.