నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న బోర్లను బుధవారం మున్సిపల్ అధికారులు తొలగించి సీల్ వేసారు. ఈ సందర్బంగా మున్సిపల్ టిపివో శ్రీధర్, ఏఈ నరేష్, టిపిఎస్ ప్రదీప్, మున్సిపల్ సానిటరీ ఇనస్పెక్టర్ సదానందంలు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు, బోర్లను ఎవరు ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకున్న తొలగిస్తామని వారు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలివాడలో అక్రమంగా బోర్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారంతో దానిని తొలగించి, సీజ్ చేసారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.