సెక్యూరిటీ గార్డ్స్ ల అక్రమ తొలగింపులు ఆపాలి

– రాజక్కపేట పరిధిలో సోలార్ ప్లాంట్ లో ఘటన
– 3వ రోజుకి చేరుకున్న సమ్మె 
– సెక్యూరిటీ గార్డులను మద్దతు తెలిపిన సిఐటియు జిల్లా కోశాధికారి జి.భాస్కర్
నవతెలంగాణ దుబ్బాక రూరల్ :
గత మూడు రోజులుగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట పరిధిలోని సోలార్ ప్లాంట్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారు. ఐతే ఈ సమ్మెకు  గురువారం సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మద్దతు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఈ సోలార్ ప్లాంట్ లో సెక్యూరిటీ గాడ్స్ గా 18 మంది పనిచేస్తున్నారన్నారు.కానీ ఈ మధ్యలో సరస్వతి సేఫ్ హ్యాండ్స్ కంపెనీ వారు ఇద్దరూ సెక్యూరిటీ గార్డ్స్ ను అక్రమంగా తొలగించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.వెంటనే అక్రమ తొలగింపులను ఆపి 18 మంది సెక్రెటరీ గార్డ్స్ లను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.సెక్యూరిటీ గార్డ్స్ కు వారాంతపు సెలవులు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు అమలు చేయకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని విమర్శించారు.సోలార్ ప్లాంట్ యాజమాన్యం మరియు సెక్యూరిటీ గార్డ్ యాజమాన్యాలు వెంటనే స్పందించి అక్రమ తొలగింపులను నివారించి, వారాంతపు సెలవులతో పాటు  కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, నాయకుల సాజిద్ సోలార్ పార్క్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రశాంత్, బాలకిషన్, ప్రవీణ్, బాబు, రవి, వెంకటేశ్, మహేష్, శేకర్, పర్శరాములు, చంద్రకాంత్, దిలీప్,  మోసీన్ బాబా, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.