రేగుల గూడెంలో అక్రమ ఇంటి నిర్మాణాలు.?

– అధికారులు మందలించిన ఆగని వైనం
– యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లో కట్టడాలు
– ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
నవతెలంగాణ – మల్హర్ రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని రేగుల గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని  ప్రభుత్వ భూముల్లో గ్రామపంచాయితీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా యథేచ్ఛగా అక్రమ ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్రమ ఇంటి నిర్మాణాలు ఆపాలని సంబంధించిన అధికారులు అక్రమార్కులపై కేసులు,నోటీస్ లు ఇచ్చినా కట్టడాలు ఆగడం లేదని, అధికారులే బహిరంగంగా చెప్పడం గమనార్హం. ఎక్కువగా సర్వే నెంబర్లు 132,248,176,145, 3/A లలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇష్టానుసారంగా ఇండ్ల నిర్మాణాలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించిన అధికారుల మాటలు బేఖాతర్ చెస్తూ యథేచ్ఛగా ఇంటి నిర్మాణాలు సాగిస్తున్నారు. గతంలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపట్టిన పలువురికి షోకాజ్ నోటీలు, కేసులు సైతం చేసిన అక్రమ ఇండ్ల నిర్మాణాలు అగకపోవడం విడ్డురంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కులు ఇచ్చే మామూళ్లకు తలొగ్గి తూతుమంత్రంగా దాడులు చేస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోని అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.