– మట్టి వాహనాలను అడ్డుకున్న స్థానికుడు
– ప్రభుత్వ సెలవు రోజు మాఫీయాదారుల అక్రమ మట్టి రవాణ
– భారీ వాహనాలతో మట్టిరోడ్డు బురదమయం
నవతెలంగాణ – బెజ్జంకి
అధికార యంత్రాంగం అండతోనే మాఫీయాదారులు మండల కేంద్రంలో యథేచ్ఛగా అక్రమ మట్టి దందాను సాగిస్తున్నారని స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. అదివారం ప్రభుత్వ సెలవు రోజున మాఫీయాదారులు ఎలాంటి అధికారుల అనుమతుల్లేకుండా యథేచ్ఛగా భారీ వాహనాలతో మట్టి రవాణ సాగించడాన్ని స్థానిక యువకుడు అడ్డుకున్నాడు.భారీ వాహనాలతో మట్టి రవాణ సాగించడం వల్ల దళిత కాలనికి వెళ్లే మట్టి రోడ్డు గుంతలతో బురదమయమై కాలనివాసులు ప్రమాదాలకు గురవుతున్నారని యువకుడు అవేదన వ్యక్తం చేశారు.అక్రమ మట్టి రవాణపై తహసిల్దార్ స్పదించడం లేదని జోరుగా సాగుతున్న అక్రమ మట్టి రవాణపై మండల అధికార యంత్రాంగం చట్టపరమైన చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో మండల అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టరుకు పిర్యాదు చేస్తామని యువకుడు హెచ్చరించారు. అక్రమ మట్టి రవాణపై తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా సంబంధిత మైనింగ్ శాఖ అధికారులే చర్యలు చేపట్టాలని తెలిపారు.