అక్రమ మోరం మట్టి దందా పరంపర

– బొందలగడ్డలుగా మారుస్తున్న స్మశానవాటిక భూమి
నవతెలంగాణ-రామకృష్ణాపూర్

పట్టణం లోని ఆర్ కె1 ఏరియా మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డు ప్రాంత సమీపంలోని స్మశానవాటిక ప్రాంతంలో అక్రమార్కులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మట్టిని తరలిస్తున్న వారిని నవతెలంగాణ విలేకరి అనుమతులు ఉన్నాయా అని ట్రాక్టర్ యజమానిని ప్రశ్నించగా స్థానిక ఓ కౌన్సిలర్ అండదండలతోనే ఇది చేస్తున్నామని బహిరంగంగానే చెబుతున్నారు.బొందలా గడ్డలుగా మారుస్తు మోరం మట్టి దందాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న ట్రాక్టర్ యజమానులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే!!!!