సెలవురోజు అక్రమ మట్టి దందా..

– అదివారం యథేచ్ఛగా మండల కేంద్రంలో మట్టి రవాణ 
– కన్నెత్తి చూడని అధికారులు
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రభుత్వ సెలవు రోజుల్లో అక్రమ మట్టి దందా మండలంలో ఆగడం లేదు.ఎలాంటి అనమతుల్లేకుండా కేవలం అధికారుల మాముళ్లలోనే సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం ప్రభుత్వ సేలవు రోజున సైతం మండల కేంద్రంలో యథేచ్ఛగా మట్టి రవాణ సాగడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు అక్రమంగా సాగిస్తున్న మట్టి రవాణ వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే మాఫీయాదారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే మామూళ్ల మత్తులోనే విధులు నిర్వర్తిస్తున్నారని జిల్లాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి అక్రమ మట్టి రవాణను నిలువరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.