
ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా 164.58 క్వింటళ్ళ పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని ఎస్సై అభిలాష్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మట్లాడుతూ శుక్రవారం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వరంగల్ జిల్లా బీమదేవరపల్లి మండలం, ముల్కనూర్ గ్రామానికి చెందిన ముద్రకోల అనిల్ టీఎస్02యూబీ1808 గల వాహనంలో 341 బస్తాల బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా గుర్తించి పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట కానిస్టేబుల్‌లు సిహెచ్.రమేష్, ఎం.తిరుపతి, తదితరులు ఉన్నారు.