హుస్నాబాద్ మండలం లోని పందిల్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన అక్రమ ఇసుక డంపును బుదవారం సిద్దిపేట టాస్క్ ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పందిల్ల గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ అనుమతి ఎలాంటి వే బిల్లులు లేకుండా 40 టన్నుల ఇసుకను అక్రమంగా డంపు చేశారని చెప్పారు. నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, హుస్నాబాద్ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి అక్రమ రవాణా, పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667445 ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.