అడవిలో అక్రమ ఇసుక దందా? 

– చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ రేంజ్, మల్లారం సెక్షన్ మరియు బిట్ పరిదిలోగల మిషన్ భగీరథ వాటర్ ట్యాoక్ సమీపంలోని అడవి మార్గం గుండా అక్రమ ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా గత కొద్దీ రోజులుగా కొనసాగుతున్న సంబంధించిన రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖ, పోలీస్ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమార్కులు రాత్రివేలలో ట్రాక్టర్ల ద్వారా మానేరు నుంచి ఇసుకను తరలిస్తూ పారెస్ట్ లో డంపింగ్ లు చేస్తూ అర్ధరాత్రి వేళల్లో లారీలలో లోడ్ చేసుకొని పట్టణాలకు తరలిస్తూ లక్షలు ఘడిస్తున్నారు.ఇసుక దందాపై ఎవరికి అనుమానాలు రాకుండా తాడిచెర్ల ఓసిపి నుంచి బొగ్గు తరలిస్తున్న, మల్లారం క్వారీ నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలలో ఈ అక్రమ ఇసుక లారీలు సైతం వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక దందాకు ముకుతాడు వేసి సహజ వనరైన ఇసుకను కాపాడాలని పలువురు కోరుతున్నారు.