అక్రమ ఇసుక దందాకు హద్దులు లేవు

– ఇసుక కావాలంటే ఐదు వేల రూపాయలకు ట్రాక్టర్ .. నాలుగు వేల రూపాయలకు బొలెరో..
– ఆర్డర్ ఇవ్వండి తెల్లవారే కంటే ముందే ఇంటి ముందర ఇసుక దిబ్బలు
నవతెలంగాణ  – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్,  డోంగ్లి, మండలాల్లో అక్రమ ఇసుక దందాకు హద్దులు లేకుండా పోయాయి. ఇసుక కావాలంటే ఐదు వేల రూపాయలకు ట్రాక్టర్,  నాలుగు రూపాయలకు బొలోరో ఆర్డర్ ఇవ్వండి తెల్లవారక మునిపే ఇంటి ముందర ఇసుక దిబ్బలు. ఎంత కావాలంటే అంత రాత్రికి రాత్రే ఇంటి ముందర ఇసుక వచ్చి చేరుతుంది. అక్రమ ఇసుక దారులు ఇష్టం వచ్చిన ధరలతో అనుమతులు లేకుండానే మంజీరా నది నుండి ఇసుక అక్రమంగా తరలిస్తూ వేలాది రూపాయల సంపాదన చేసుకుంటుంటే అక్రమ ఇసుక దారుల పట్ల సంబంధిత శాఖల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాత్రి వేళల్లో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తుంది అనడానికి ఇండ్ల ముందర తెల్లవారకమునిపే ఇసుక దిగుమతి అయ్యే దృశ్యాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ధరలు పెరగడానికి ఇసుక రానివ్వడం లేదంటూ ఇసుక అవసరం గల వ్యక్తులకు ధర అధికంగా పెట్టి రాత్రికి రాత్రి రూ.5 వేల రూపాయల ట్రాక్టర్,  రూ.4000 రూపాయలకు బోలోరో ఇసుక అక్రమంగా మద్నూరు ఉమ్మడి మండలంలో జోరుగా కొనసాగుతుంది. ఇసుక అక్రమ దందాలపై అధికారుల నిఘా లేకపోవడం, ఇండ్ల నిర్మాణాల దారులకు ఇసుక రేటు ఇష్ట రాజ్యంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇసుక తేవాలంటే అధికారులు పట్టుకుంటున్నారని దొంగ చాటుగా తీసుకురావడం ధరలు పెంచి ఇవ్వవలసిందేనని ఇసుక అవసరమున్న వ్యక్తులు అవసరాల కోసం ఎంత రేటు అయిన పెట్టి కొనుగోలు చేసుకుంటున్నారు మంజీరా నది అక్రమ ఇసుక దారులకు సొంత పట్టాగా మారింది అధికారుల నిఘా లోపం రెట్టింపు ధరలతో ఇసుక అక్రమంగా తరలించి అమ్మకాలు జరుపుతున్నారు రాత్రి వేళల్లో అక్రమ ఇసుక దందా పట్ల సంబంధిత శాఖ అధికారులు గట్టి నిగా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇసుక ధరలు అదుపు లేకుండా అక్రమ దారులు రోజుకు వేలాది రూపాయలు జేబులు నింపుకుంటున్నారని ప్రజల్లో ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి ధరల నియంత్రణ కోసమైనా అధికారుల చర్యలు అవసరమని ఇసుక అవసరమైన వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇసుక కావాలంటే అక్రమ ఇసుక దందా వ్యక్తులకు ఆశ్రయించక తప్పడం లేదు ఇసుక అక్రమ దందా కొనసాగకుండా సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీనిగా పెట్టవలసిన అవసరం ఉంది.