– క్రాంతి మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌లో తనిఖీలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డ్రగ్ కంట్రోల్ అధికారులు చేసిన దాడుల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. హన్మకొండ జిల్లా, వేలేర్ మండలం, వేలేర్ గ్రామంలోని క్రాంతి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌పై చేసిన దాడిలో పెద్ద మొత్తంలో ఫిజిషియన్ శాంపిళ్లను పట్టుకున్నారు. వీటితో పాటు కాలం చెల్లిన మందులను కూడా డీసీఏ అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ రూ.ఒక లక్ష వరకు ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు చేసిన ఈ దాడిలో ఉచితంగా డాక్టర్లు ఇవ్వాల్సిన ఫిజిషియన్ శాంపిళ్లు కూడా ఉన్నాయి.